తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు - పవన్ కళ్యాణ్..!

  • IndiaGlitz, [Friday,January 13 2017]

తెలుగు వారంద‌రికీ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు.

సంక్రాంతి సంద‌ర్భంగా ప‌వ‌న్ స్పందిస్తూ...ఈ సంక్రాంతి పాల‌కుల్లో కాంతిని నింపి ఏ.పి కి ప్ర‌త్యేక హోదాని అందింప చేస్తుంద‌ని, క‌రెన్సీ ర‌ద్దు వంటి గాయాల‌ను మ‌రో మారు చేయ‌కుండా రాజ‌కీయ పెద్ద‌ల నుంచి కాపాడుతుంద‌ని విశ్వ‌సిస్తున్నాను.

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్ష‌ముగా ఉండేలా సూర్య భ‌గ‌వానుడు ఆశీర్వ‌దించాల‌ని ప్రార్ధిస్తున్నాను. ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ బాధితుల‌కు ఈ సంక్రాంతి స్వాంత‌న క‌లుగ చేస్తుంద‌ని ఆకాంక్షిస్తూ నా త‌రుపున జ‌న‌సేన శ్రేణుల త‌రుపున దేశ ప్ర‌జ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను అన్నారు.