పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వీడియో లీక్

  • IndiaGlitz, [Monday,February 03 2020]

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డా అధికారికంగా స‌మాచారం రాకున్న‌ప్ప‌టికీ అన‌ధికారికంగా పవ‌న్ ఇప్ప‌టికే రెండు సినిమాల‌ను ఓకే చేశారు. మ‌రో రెండు సినిమాల‌ను ట్రాక్ ఎక్కించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కాగా.. ప్ర‌స్తుతం 'పింక్‌' రీమేక్ చిత్రీక‌ర‌ణ‌లో ప‌వ‌న్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను లీకేజీల స‌మ‌స్య తెగ ఇబ్బంది పెడుతుంది. సినిమా ప్రారంభం రోజునే ప‌వ‌న్ లుక్ లీక్ అయ్యింది. కాగా.. ఇప్పుడు 20 సెక‌న్స్ వ్య‌వ‌థి ఉన్న వీడియోను లీకేజీ వీరులు విడుద‌ల చేశారు.

ఈ వీడియోలో నేను న‌ల్ల‌కోటు వేసుకుంటే వేయ‌డానికి పిటీష‌న్స్‌..తీసుకోవ‌డానికి బెయిల్స్ ఉండ‌వు' అని త‌న‌తో మాట్లాడుతున్న వ్య‌క్తితో ప‌వ‌న్ డైలాగ్ చెబుతున్నారు. స్పాట్‌లోని వ్య‌క్తులే ర‌హ‌స్యంగా ఈ వీడియో చిత్రీకరించి లీక్ చేశార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది వేస‌వి సంద‌ర్భంగా మే 25న సినిమాను విడుదల చేస్తున్నామ‌ని నిర్మాత దిల్‌రాజు ప్ర‌క‌టించారు. దీని వెంట‌నే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్..ఓ పీరియాడిక‌ల్ మూవీలో రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈసినిమా కూడా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

More News

‘అల..’ సక్సెస్.. డైరెక్టర్స్‌కు బన్నీ గ్రాండ్ పార్టీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

పవన్ ‘పింక్’ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్!?

టాలీవుడ్ టాటా చెప్పేసి.. రాజకీయాల్లో రాణించాలని రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్.. జనసేన అంటూ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దూకాడు.

‘ప్రేమ ఎంత మధురం’ అనే సరికొత్త సీరియల్‌తో మన ముందుకు రాబోతున్న జీ తెలుగు

ప్రేమ ప్రేమని మాత్రమే కోరుకుంటుంది. స్వచ్ఛమైన ప్రేమకు డబ్బు, కులం, మతం, ఆస్తులు, అంతస్తులు లాంటి పట్టింపులు ఉండవు. అలాగే స్వచ్చమైన ప్రేమకు వయస్సు కూడా అడ్డంకి కాదు.

చిరుతో త‌ల‌ప‌డ‌నున్న క‌లెక్ష‌న్ కింగ్‌?

కొన్ని అరుదైన కాంబినేష‌న్స్‌ను తెర‌పై చూసి ప్రేక్ష‌కుల తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి క్రేజీ కాంబినేష‌న్‌లో

ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో అఖిల్‌?

అక్కినేని మూడో త‌రం న‌ట వార‌సుడిగా.. అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అక్కినేని అఖిల్ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాడు.