డైరెక్టర్ అవుతానంటున్న పవన్ కుమార్తె
- IndiaGlitz, [Monday,October 28 2019]
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే దాదాపు డజను మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే అమ్మాయిల విషయానికి సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంది. కాగా..నిహారిక సినిమాల్లో హీరోయిన్గా రాణించాలని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. దీంతో ఆమె తిరిగి తనకు అచ్చొచ్చిన వెబ్సిరీస్లతోనే బిజీగా మారిపోయింది. అయితే ఈ ఫ్యామిలీ మెంబర్స్‌కు భిన్నంగా పవన్ కుమార్తె ఆద్య మాత్రం వ్యవహరిస్తానంటోంది.
ఎందుకంటే ఆద్య డైరెక్టర్ కావాలనుకుంటుందట. ఈ విషయాన్ని చరణ్ తెలియజేశాడు. చరణ్ ఇంటికి సుస్మిత, నిహారిక, శ్రీజ పిల్లలు వచ్చినప్పుడు చరణ్ లేకపోతే అక్కడనున్న బోర్డులో వారికి నచ్చిన కోరికను రాసి వెళ్లిపోతారట. అలా ఆద్య రాసిన కోరిక ఏంటో తెలుసా? డైరెక్టర్ కావాలనుకుంటుందట. అది కూడా రామ్‌చరణ్‌ను హీరోగా పెట్టి ఆద్య ఓ సినిమా చేయాలనుకుంటుందట. మరి ఆద్య పెరిగి పెద్దయిన తర్వాత నిజంగానే డైరెక్టర్ అయితే మాత్రం మెగా ఫ్యామిలీ నుండి సినిమా రంగానికి పరిచయం అయిన తొలి టెక్నీషియన్స్ ఆద్యనే అవుతుంది.
రామ్‌చరణ్ నిర్మాతగా మారి ఇప్పుడు ఏకధాటిగా చిరంజీవితో వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్గా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. త్వరలోనే చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి కూడా రామ్‌చరణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరోపక్క చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో నటిస్తున్నాడు.