Pawan Kalyan: ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ ప్రచారం పక్కా.. షెడ్యూల్ ఖరారు..!

  • IndiaGlitz, [Tuesday,November 21 2023]

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు ఇతర బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొని తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది.. కానీ ఇంతవరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆయన ప్రచారం చేస్తారా..? లేదా..? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానంగా జనసేనాని ఎన్నికల కదన రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.

జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు కూటమిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 23వ తేదిన నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కృష్ణారెడ్డితో పాటు వరంగల్‌ వెస్ట్‌ నియోజకవర్గంలోనూ కమలం అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఈనెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్‌గౌడ్‌కు మద్దతుగా, 26న కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ తరపున క్యాంపెయిన్ చేయనున్నారు.

అలాగే తెలంగాణలో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగసభలు, రోడ్ షోల్లోనూ పవన్‌ పాల్గొననున్నారు. దీంతో పవన్ ప్రచారం తమకు మరింత ప్లస్ అవుతుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తోంది. మొత్తానికి అభ్యర్థుల గెలుపు కోసం పవన్ కల్యాణ్‌ పవర్‌ఫుల్ స్పీచ్‌లు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More News

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారు

తెలంగాణ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

ఏం సాధించారని 'పచ్చ' నేతల సంబరాలు.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..

ఏదో సాధించినట్లు సంబరాలు.. స్వాత్రంత్య సమరయోధుడు జైలు నుంచి బయటకు వచ్చినట్లు బిల్డప్‌లు.. పచ్చ నేతల హంగామా ఇంతా కాదు.

కబడ్డీ కోసం బరిలో దిగిన బాలయ్య, కిచ్చ సుదీప్, టైగర్ ష్రాప్

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) అటు సినిమాలు.. ఇటు టాక్‌ షో, యాడ్స్‌లతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే బాలయ్య హోస్ట్ చేస్తు్న్న అన్‌స్టాపబుల్ టాక్ షో సూపర్ హిట్‌ అవ్వగా..

KCR: కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? జనాలను ఆకట్టుకోవడం లేదా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ఎన్నికల ప్రచారంలో

Pawan Kalyan: విశాఖ హార్బర్ ప్రమాద బాధితులకు సాయం చేయనున్న పవన్ కల్యాణ్

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.