‘‘భీమ్లా నాయక్’’ ఆ రెండింటిలో ఏ రోజునో మరి..?
Send us your feedback to audioarticles@vaarta.com
రానున్న మూడు నెలల్లో సినిమా పండగని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు చెప్పినట్లుగానే టాలీవుడ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కరోనా, తదితర కారణాలతో రిలీజ్‌ని వాయిదా వేసుకున్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. రాజమౌళి సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’ ఈ విషయంలో ఫస్ట్ స్టెప్ వేసింది. ఇప్పటికే ప్రకటించిన డేట్స్ కాదని.. మార్చి 25న ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు. దీంతో ఒకదాని వెంట మరొకటి పెద్ద సినిమాలన్నీ కొత్త విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి.
దీనిలో భాగంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్- రానాలు నటించిన మల్టీస్టారర్ ‘‘భీమ్లా నాయక్’’ యూనిట్ కూడా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 25 లేదా.. ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కరోనా, తదితర పరిస్థితులను బట్టి విడుదల ఆధారపడి ఉంటుందని తెలిపింది. వాస్తవానికి భీమ్లా నాయక్ సంక్రాంతికి రావాల్సింది. కానీ అప్పట్లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకోవడంతో.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల శ్రేయస్సు దృష్ట్యా భీమ్లా నాయక్.. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మహా శివరాత్రి కానుకగా సినిమాను విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కారణంగా భీమ్లా రెండు డేట్స్ ను లాక్ చేసుకున్నాడు. మరి ఈ రెండింటిలో ఏ డేట్‌కి వస్తాడో చూడాలి.
ఈ సినిమాలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout