'వ‌కీల్‌సాబ్' కోసం ప‌వ‌న్ ప‌డ్డ క‌ష్టం

  • IndiaGlitz, [Monday,April 20 2020]

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ చిత్రం ‘పింక్’కు ఇది రీమేక్. ఈ ఏడాది మే 15న వ‌కీల్‌సాబ్‌ను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీక‌పూర్ భావించారు. అయితే కోవిడ్ 19 విజృంభించ‌డంతో దేశంలోని అన్నీ సినిమాల షూటింగ్‌ల‌ను ఆపేశారు. అలా వ‌కీల్‌సాబ్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు రీసెంట్‌గా మాట్లాడారు.

‘‘వ‌కీల్ సాబ్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఒక ప‌క్క రాజ‌కీయాల‌కు సంబంధించిన ప‌నుల‌ను చూసుకుంటూనే ప‌వ‌న్ సినిమాలో న‌టించారు. అందు కోసం ఆయ‌న చాలా కష్టపడ్డారు. 22 రోజుల పాటు రాత్రి సమయాల్లో సినిమాను చిత్రీకరించారు. ఆ సమయంలో పవన్‌క‌ల్యాణ్ ప‌గ‌లు రాజ‌కీయ ప‌నుల్లో బిజీగా ఉండేవారు. అందుకోసం నిర్మాత ఓ చార్టెడ్ ఫ్లైట్‌ను అరెంజ్ చేశారు. అందులో ప‌వ‌న్ 22 రోజుల పాటు ప్ర‌యాణించారు. ఈ 22 రోజుల్లో దాదాపు 600 కిలోమీట‌ర్ల‌కు పైగా ప్ర‌యాణించారు’’ అని తెలిపారు డైరెక్ట‌ర్ శ్రీరామ్ వేణు. ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. ప్ర‌కాశ్‌రాజ్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.