అన్నయ్య చెయ్యి పట్టుకుని పెరిగాను: చిరుకు పవన్ బర్త్‌డే విషెస్

మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య చిరంజీవి గారు తన స్ఫూర్తి ప్రదాత అని పవన్ పేర్కొన్నారు. అన్నావదినలు తనకు తల్లిదండ్రులతో సమానమని వెల్లడించారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు.. అసామాన్యుడిగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని పవన్ పేర్కొన్నారు. తెలుగువారు సగర్వంగా చిరంజీవి మావాడు అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నారన్నారు.

‘‘అన్నయ్య చిరంజీవి నా స్ఫూర్తి ప్రధాత. నాకు జన్మిచ్చిన నా తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో నా అన్నయ్య చిరంజీవిని కూడా అంతలా పూజ్య భావంతో అమితంగా ప్రేమిస్తాను. నా అన్నయ్య చిరంజీవి, సురేఖ వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. నేను అన్నయ్య చేయిపట్టి పెరిగాను, ఒక్కమాటలో చెప్పాలంటే అన్నయ్యే నా మొదటి గురువు.. అమ్మలా లాలించారు.. నాన్నలా మార్గదర్శిగా నిలిచారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిపిస్తాయి. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాదిమంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించారు. తెలుగువారు సగర్వంగా 'చిరంజీవి మావాడు' అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి, నా లాంటి వారు ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిచారు.

కష్టాన్ని నమ్ముకున్నారు.. సముచిత స్థానానికి చేరుకున్నారు. చిన్నపాయగా ఉద్భవించే నది అఖండ రూపాన్ని సంతరించుకున్నట్లు అన్నయ్య చిరంజీవి ఎదిగారు. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే.. ఆయనలా సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారు. తన అభిమానులకు 'సేవ' అనే సత్కార్యానికి దారిచూపారు, ఎందరో ఆ దారిలో పయనిస్తూ నేడు సమాజంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆపన్నులకు అండగా ఉంటున్నారు.. అటువంటి కృషీవలునికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేడు చిరంజీవి గారి జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను తెలుగు వారందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారికి చిరాయువుతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. అన్నయ్యకు ప్రేమ పూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.

More News

బిగ్‌బాస్ 4.. ఈసారి అన్నీ ఆసక్తికర అంశాలే...

నాగార్జున అక్కినేని వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 4లో ఈ సారి పలు ఆసక్తికర విషయాలున్నట్టు తెలుస్తోంది.

ప్యాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 3 స్థానం దక్కించుకున్న విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఓటీటీలో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. అనౌన్స్ చేసిన సూర్య‌

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు.

నెటిజన్లకు బహిరంగ క్షమాపణ చెప్పిన నెట్‌ఫ్లిక్స్..

నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దిగొచ్చింది. ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పింది.

తెలంగాణలో లక్ష దాటిన కేసులు.. రాష్ట్రంలో కొత్తగా..

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. శనివారం హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.