ఆయురారోగ్యాలతో ఉండాలి.. : బాబుకు పవన్ బర్త్ డే విషెస్
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపగా మరికొందరు ఫోన్ల ద్వారా.. ఇంకొందరు ప్రకటనల ద్వారా విషెస్ చెబుతున్నారు. ఇవాళ ఉదయమే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ విషెస్..
తాజాగా.. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గౌరనీయులైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.
చిరు విషెస్..
ఇవాళ ఉదయమే మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా బాబు విషెస్ చేశారు. ‘అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుణ్ని కోరుతున్నాను. మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ దూరదృష్టి, కష్టించే తత్వం, మీ అంకిత భావం చాలా గొప్పవి’ అని బాబుతో కలిసున్న ఫొటోను మెగాస్టార్ ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments