ఆయురారోగ్యాలతో ఉండాలి.. : బాబుకు పవన్ బర్త్ డే విషెస్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపగా మరికొందరు ఫోన్‌ల ద్వారా.. ఇంకొందరు ప్రకటనల ద్వారా విషెస్ చెబుతున్నారు. ఇవాళ ఉదయమే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ విషెస్..

తాజాగా.. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్‌ ద్వారా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గౌరనీయులైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

చిరు విషెస్..

ఇవాళ ఉదయమే మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా బాబు విషెస్ చేశారు. ‘అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుణ్ని కోరుతున్నాను. మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ దూర‌దృష్టి, క‌ష్టించే త‌త్వం, మీ అంకిత భావం చాలా గొప్పవి’ అని బాబుతో కలిసున్న ఫొటోను మెగాస్టార్ ట్వీట్ చేశారు.

More News

తెలంగాణలో 872కు చేరుకున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 872కు చేరుకుంది.

ఇకపై చిరు సినిమాలన్నీ కుర్ర దర్శకులతోనే!?

రాజకీయాలకు రాం రాం చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు తీయడానికి సీనియర్, కుర్ర దర్శకులు క్యూ కడుతున్నారు.

గుంటూరులో యువకుడి చావుకు కారణమేంటి.. !?

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా కాటేస్తున్న తరుణంలో ఘోరం జరిగిపోయింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడని మొహమ్మద్ గౌస్ అనే యువకుడ్ని పోలీసులు కొట్టారని..

షాకింగ్: ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు.. ప్రభుత్వాలకు వారథిలా.. మరీ ముఖ్యంగా ప్రజలను నిత్యం చైతన్యపరుస్తుండే పాత్రికేయులను కూడా ఈ వైరస్ వదలట్లేదు.

ఇక‌పై డ‌బ్బింగ్ సినిమాల‌కు ఇబ్బందేనా..!

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా స్తంభించింది. ప‌లు దేశాలు కోవిడ్ 19 నుండి బారి నుండి త‌ప్పించుకోవ‌డానికి లాక్‌డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి.