Pawan Kalyan:విడాకుల రూమర్స్‌కు చెక్ : భర్తతో అన్నా లెజ్‌నేవా పూజలు, ఒక్క ఫోటోతో అందరికి ఇచ్చిపడేసిన పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
నాగబాబు కుమార్తె నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఎంతో ఘనంగా జరిగిన వీరి పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగా మిగలడంతో ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పుకారు రాయుళ్లు రెచ్చిపోయారు. మెగా ఫ్యామిలీలో మరో జంట విడాకులకు సిద్ధమైందంటూ ఇష్టమొచ్చినట్లుగా వార్తలు రాశారు. ఈ పిచ్చి రాతలు ఎవరి గురించో తెలుసా ఏకంగా జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. ఇప్పటికే నందిని, రేణూ దేశాయ్‌లతో పవన్‌కు పెళ్లిళ్లు జరగ్గా.. వారికి పవన్ విడాకులు ఇచ్చారు. తర్వాత తనతో కలిసి నటించిన , రష్యన్ నటి అన్నా లెజ్‌నేవాను ఆయన పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా.
ఇంట్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన పవన్ దంపతులు :
అన్నా లెజ్‌నేవా- పవన్ ఎంతో అన్యోన్యంగా వుంటున్నారు. తనకు వీలున్నప్పుడల్లా ఆయన కుటుంబంతో గడిపేందుకే ఇష్టపడతారు. భార్యాబిడ్డలను తీసుకుని పలుమార్లు రష్యా కూడా వెళ్లొచ్చారు పవన్. ఇలాంటి జంట విడిపోతోందంటూ మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన జనసేన పార్టీ .. పుకార్లకు చెక్ పెట్టేలా కొన్ని ఫోటోలు విడుదల చేసింది. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కల్యాణ్ , ఆయన సతీమణి అన్నా లేజ్‌నేవాలు హైదరాబాద్‌లోని తమ నివాసంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వారాహి విజయయాత్ర తదుపరి దశ త్వరలో మొదలవుతున్న నేపథ్యంలో .. సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ త్వరలోనే మంగళగిరికి చేరుకుంటారని జనసేన పార్టీ తెలియజేసింది.
రెండో దశ వారాహి యాత్ర కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ :
మరోవైపు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లో వారాహి విజయయాత్రను విజయవంతంగా నిర్వహించారు పవన్ కల్యాణ్. కత్తిపూడి నుంచి భీమవరం వరకు జరిగిన ఈ యాత్రలో అధికార వైసీపీపై వాడి వేడి విమర్శలు గుప్పించడంతో పాటు జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది స్పష్టంగా వివరించారు పవన్. ఆయన సభలకు జనం పోటెత్తడం, అనుకున్న దానికంటే కార్యక్రమం సక్సెస్ కావడంతో జనసేన క్యాడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. ఈ దశలో రెండో దశ వారాహి విజయయాత్ర కోసం అంతా ఎదరుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout