బి.జె.పి కి వార్నింగ్ ఇచ్చిన‌ ప‌వ‌న్

  • IndiaGlitz, [Saturday,April 30 2016]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ గ‌త కొన్ని రోజులుగా కేంద్రాన్ని అడుగుతున్న‌ప్ప‌టికీ...అదిగో..ఇదిగో అంటుంది కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా పై ఏ విష‌యం చెప్ప‌లేదు. ఈ విష‌యం గురించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ ...స‌రిగ్గా రెండు సంవ‌త్స‌రాల క్రితం సీమాంధ్ర ఎం.పి ల‌ను త‌న్ని పార్ల‌మెంట్ లోంచి బ‌య‌ట‌కు గెంటి ఉమ్మ‌డి రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విడ‌గొట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఘోర‌మైన త‌ప్పు చేసింది. ఆరోజు సీమాంధ్ర ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన అవ‌మానం ఎవ‌రు మ‌ర‌చిపోలేదు. మ‌ర‌చిపోరు కూడా.

ఈరోజు ప్ర‌త్యేక హోదా కోసం ఇచ్చిన మాట మీద వెన‌క్కి త‌గ్గి సీమాంధ్ర‌ ప్ర‌జ‌ల న‌మ్మ‌కం మీద కొట్టి బిజెపి కూడా అలాంటి త‌ప్పు వైపే అడుగులు వేయ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నాను. ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌జ‌లు రోడ్లు మీద‌కు వ‌చ్చి ఉద్య‌మించే లోపే అధికార పార్టీ ఎం.పిలు, ప్ర‌తిప‌క్షాల‌ను కూడా క‌లుపుకుని పార్ల‌మెంట్ లో దీని మీద పోరాటం చేయాల‌ని సీమాంధ్ర ప్ర‌జ‌ల త‌రుపున నా విన్న‌పం అంటూ బి.జె.పి కి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. మ‌రి... ప‌వ‌న్ స్పంద‌న పై బి.జె.పి ప్ర‌తి స్పంద‌న ఎలా ఉంటుందో..? అధికార ప‌క్షం - ప్ర‌తిప‌క్షం ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

మే 13న జి.వి.ప్రకాష్ , శ్రీదివ్యల 'పెన్సిల్'

తెలుగు,తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్,మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు,బస్ స్టాప్,కేరింత,

కబాలి టీజర్ రిలీజ్ ఆ రోజే..

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్నచిత్రం కబాలి.

బ్ర‌హ్మోత్స‌వం బైక్ కాపీనా..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం చిత్రాన్ని మే 20న రిలీజ్ చేయ‌నున్నారు.

ఆరు నెలల్లో అరవై కథలు విన్న యువ హీరో

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలి, సాహస బాలుడు విచిత్ర కోతి.. చిత్రాల్లో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకొని వినవయ్య రామయ్య చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ హీరో నాగ్ అన్వేష్.

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌నంటున్న క‌మ‌ల్..

క‌మ‌ల్ హాస‌న్ తాజా చిత్రం శ‌భాష్ నాయుడు. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు టి.కె. రాజీవ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ కుమార్తె గా శృతిహాస‌న్ న‌టిస్తుండ‌డం విశేషం. చెన్నైలో ఈ చిత్రం ప్రారంభ‌మైంది.