బి.జె.పి కి వార్నింగ్ ఇచ్చిన పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా కేంద్రాన్ని అడుగుతున్నప్పటికీ...అదిగో..ఇదిగో అంటుంది కానీ...ఇప్పటి వరకు ప్రత్యేక హోదా పై ఏ విషయం చెప్పలేదు. ఈ విషయం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందిస్తూ ...సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎం.పి లను తన్ని పార్లమెంట్ లోంచి బయటకు గెంటి ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. ఆరోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరు మరచిపోలేదు. మరచిపోరు కూడా.
ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి బిజెపి కూడా అలాంటి తప్పు వైపే అడుగులు వేయకూడదని కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదా గురించి ప్రజలు రోడ్లు మీదకు వచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎం.పిలు, ప్రతిపక్షాలను కూడా కలుపుకుని పార్లమెంట్ లో దీని మీద పోరాటం చేయాలని సీమాంధ్ర ప్రజల తరుపున నా విన్నపం అంటూ బి.జె.పి కి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. మరి... పవన్ స్పందన పై బి.జె.పి ప్రతి స్పందన ఎలా ఉంటుందో..? అధికార పక్షం - ప్రతిపక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout