మళ్లీ రిపీట్ అయితే చూస్తూ కూర్చోం.. : పవన్ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో జనసేన కార్యకర్తలు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకున్న పవన్ నేరుగా.. కాకినాడకు వెళ్లి వారిని పరామర్శించారు. పవన్ రాకతో జనసేన కార్యకర్తలు వర్సెస్ పోలీసులు మధ్య ఘర్షణ నెలకొంది. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా మీట్ నిర్వహించిన పోలీసులు, వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ లాంటి ఘటనలు మళ్లీ మళ్లీ రిపీట్ అయితే ఊరుకోమని పవన్ ఒకింత వార్నింగ్ ఇచ్చారు.
పవన్ వార్నింగ్..
‘ కార్యకర్తలపై దాడి దురుదృష్టకరం. వైసీపీ నేతలు అకారణంగా దాడిచేశారు. ప్రజాప్రతినిధులు దారుణంగా మాట్లాడుతున్నారు. ద్వారంపూడి వాడిన భాష క్షమించరానిది. పండుగ సమయంలో లేని గొడవలు సృష్టించొద్దు. మీరే తిట్టి, మీరే మాపై దాడి చేసి.. మాపైనే మళ్లీ కేసులు పెడతారా..?. పచ్చిబూతులు తిట్టారు.. కారణం లేకుండా దాడులు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు బాధ్యతారహిత్యంగా ప్రవర్తించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే మేం ఊరుకోం’ అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
నేను గతంలోనే చెప్పా..!
అంతటితో ఆగని ఆయన తిట్టారని నిరసన చేస్తే.. కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా సహనాన్ని చేతకానితనంగా భావించొద్దు. బలం ఉంది కాబట్టి సంయమనంతో ఉన్నాం. నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదా..?. వైసీపీ పాలన వస్తే ఫ్యా్క్షన్ రాజకీయం వస్తుందని గతంలోనే నేను చెప్పాను. గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకూ జరగలేదు’ అని పవన్ చెప్పుకొచ్చారు.
మదమెక్కిన నేతలు..!
‘రాజధాని ఇష్యూను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఇక్కడ దాడులు జరిగాయి. ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొస్తామంటే ప్రజలు సహించరు. దాడిచేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టాల్సిందే. ఇలాంటి ఘటనలు, భాష వాడటం ఆఖరిది కావాలి. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరేమైనా దిగొచ్చారా?. వైసీపీ నేతలు స్థాయి దాటి మాట్లాడుతున్నారు. సంఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలి. జనసేనికులపై దాడి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. పాలెగాళ్ల రాజ్యం తీసుకొస్తామంటే ప్రజలు సహించరు. ఎస్పీ స్పందించి దాడులు చేసినవారిపై కేసులు పెట్టాలి. అన్యాయాలకు పోలీసులు గొడుగు పట్టొద్దు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత.. రోడ్లపైకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికే.. వైసీపీలో మదమెక్కిన నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతల మదాన్ని ప్రజలు అణచివేస్తారు’ అని పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments