మళ్లీ రిపీట్ అయితే చూస్తూ కూర్చోం.. : పవన్ వార్నింగ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో జనసేన కార్యకర్తలు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకున్న పవన్ నేరుగా.. కాకినాడకు వెళ్లి వారిని పరామర్శించారు. పవన్ రాకతో జనసేన కార్యకర్తలు వర్సెస్ పోలీసులు మధ్య ఘర్షణ నెలకొంది. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా మీట్ నిర్వహించిన పోలీసులు, వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ లాంటి ఘటనలు మళ్లీ మళ్లీ రిపీట్ అయితే ఊరుకోమని పవన్ ఒకింత వార్నింగ్ ఇచ్చారు.

పవన్ వార్నింగ్..

‘ కార్యకర్తలపై దాడి దురుదృష్టకరం. వైసీపీ నేతలు అకారణంగా దాడిచేశారు. ప్రజాప్రతినిధులు దారుణంగా మాట్లాడుతున్నారు. ద్వారంపూడి వాడిన భాష క్షమించరానిది. పండుగ సమయంలో లేని గొడవలు సృష్టించొద్దు. మీరే తిట్టి, మీరే మాపై దాడి చేసి.. మాపైనే మళ్లీ కేసులు పెడతారా..?. పచ్చిబూతులు తిట్టారు.. కారణం లేకుండా దాడులు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు బాధ్యతారహిత్యంగా ప్రవర్తించారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే మేం ఊరుకోం’ అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.

నేను గతంలోనే చెప్పా..!

అంతటితో ఆగని ఆయన తిట్టారని నిరసన చేస్తే.. కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా సహనాన్ని చేతకానితనంగా భావించొద్దు. బలం ఉంది కాబట్టి సంయమనంతో ఉన్నాం. నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదా..?. వైసీపీ పాలన వస్తే ఫ్యా్క్షన్ రాజకీయం వస్తుందని గతంలోనే నేను చెప్పాను. గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకూ జరగలేదు’ అని పవన్ చెప్పుకొచ్చారు.

మదమెక్కిన నేతలు..!

‘రాజధాని ఇష్యూను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఇక్కడ దాడులు జరిగాయి. ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకొస్తామంటే ప్రజలు సహించరు. దాడిచేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టాల్సిందే. ఇలాంటి ఘటనలు, భాష వాడటం ఆఖరిది కావాలి. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరేమైనా దిగొచ్చారా?. వైసీపీ నేతలు స్థాయి దాటి మాట్లాడుతున్నారు. సంఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయాలి. జనసేనికులపై దాడి విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తాం. పాలెగాళ్ల రాజ్యం తీసుకొస్తామంటే ప్రజలు సహించరు. ఎస్పీ స్పందించి దాడులు చేసినవారిపై కేసులు పెట్టాలి. అన్యాయాలకు పోలీసులు గొడుగు పట్టొద్దు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత.. రోడ్లపైకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికే.. వైసీపీలో మదమెక్కిన నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతల మదాన్ని ప్రజలు అణచివేస్తారు’ అని పవన్‌ కల్యాణ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

More News

హీరోయిన్‌‌ను వెతకాలని ఫ్యాన్స్‌కు మహేశ్ రెక్వెస్ట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

'నందమూరి' అనే ఇంటిపేరుకు మచ్చ తీసుకురాను!

టాలీవుడ్‌ హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు బిజిబిజీగా ఉన్న నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా రేపు అనగా జనవరి-15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అందువల్లే అల్లు అర్జున్ ఆ మాట అన్నారు: పూజా హెగ్డే

"త్రివిక్రమ్ గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఆయన నుంచి నేను ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఏ సీన్ అయినా చాలా వివరంగా చెప్తారు.

‘సరిలేరు..’ చూసొస్తుండగా సంజనకు షాకిచ్చిన పోలీసులు

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మికమందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్‌ల‌తో హీరోయిన్‌ను వేధిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, శ్రీనివాస క‌ల్యాణం, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 వంటి ప‌లు తెలుగు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరోయిన్ నందితా శ్వేత.