ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తిరగబడతాం - పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Monday,January 23 2017]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా గురించి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో బ‌హిరంగ సభ‌లు ఏర్పాటు చేయ‌డం త‌న వాద‌న ఏమిటో చెప్ప‌డం తెలిసిందే. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా గురించి ఈరోజు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ....తిడితే భ‌రించాం.. విడ‌గొట్టి గొంటేస్తే స‌హించాం..ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోతే తిర‌గ‌బ‌డతాం అన్న‌ది ఆంధ్ర యువ‌త కేంద్రానికి తెలియ‌చెప్పాలి.
అలాగే ఎపి స్పెష‌ల్ స్టేట‌స్ గురించి మ్యూజిక్ ఆల్బ‌మ్ ప్లాన్ చేసాను. దేశ్ బ‌చో అనే ఈ ఆల్బ‌మ్ ను ఫిబ్ర‌వ‌రి 5న రిలీజ్ చేయాలి అనుకున్నాను. అయితే...అనుకున్న డేట్ కంటే ముందుగా ఈనెల 24న రిలీజ్ చేయ‌నున్నాను. ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త ఈనెల 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌చేస్తే జ‌న‌సేన స‌పోర్ట్ చేస్తుంది అని తెలియ‌చేసారు.