రాజ‌కీయ వ్యవ‌స్థకి చికిత్స చేస్తా: పవన్

  • IndiaGlitz, [Monday,March 04 2019]

నేను ఓ సోష‌ల్ డాక్టర్‌ని రాజ‌కీయ వ్యవ‌స్థకి చికిత్స చేస్తాను. అంద‌రికీ ఉచిత విద్య, వైద్యం జ‌న‌సేన ల‌క్ష్యం. కుల‌మ‌తాల‌కి అతీతంగా అమ‌లుప‌రుస్తాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. చిత్తూరు న‌గ‌రంలోని బాన్స్ హోట‌ల్‌లో విద్యార్ధుల‌తో జ‌రిగిన ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ.. విద్యని ఉచితంగా అందించ‌డ‌మే కాదు. విద్యా వ్యవ‌స్థలో కూడా స‌మూల మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. స్కూల్ స్టేజ్ నుంచే అంద‌ర్నీ కులాలవారీగా విడ‌గొడుతూ ఉంటే ఎలా.? అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కూడా. జ‌న‌సేన ప్రభుత్వంలో కులాలు, మ‌తాల‌కి అతీతంగా కామ‌న్ హాస్టల్ వ్యవ‌స్థని తీసుకువ‌స్తాం. బాధ్యత‌తో కూడిన పాల‌న అందిస్తాం. విద్యార్ధులు ప్లకార్డు ప‌ట్టుకుంటే స్పంద‌న వ‌చ్చే స్థాయి వ్యవ‌స్థని రూపొందిద్దాం. నిజాయతీప‌రులు రాజ‌కీయాల‌కి దూరంగా ఉన్నారు. వారిని రాజ‌కీయాల్లోకి ఆహ్వానించ‌డం ద్వారా బాధ్యత‌తో కూడిన పాల‌న వ్యవ‌స్థని ఏర్పాటు చేస్తాం అని పవన్ భరోసా కల్పించారు.

నేను కూడా సోషల్ డాక్టర్‌ని..

మీరు డాక్టర్ అవ్వాలంటే ఐదు సంవ‌త్పరాలు చ‌దివి నేర్చుకుని వైద్యం చేస్తారు క‌దా. నేను కూడా ఒక సోష‌ల్ డాక్టర్‌ని. గ‌త ఐదేళ్లుగా ప్రజా స‌మ‌స్యల్ని చ‌దివా. చాలా నేర్చుకున్నా. ఇక ఈ రాజ‌కీయ వ్యవ‌స్థకి చికిత్స చేస్తా. స‌మాజానికి శ‌స్త్ర చికిత్స చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్నమైంది. డాక్టర్లు అంతా బ‌య‌టికి రండి. నాకు ఎంతో న‌చ్చిన విప్లవ వీరుడు చేగువేరా కూడా డాక్టరే. స‌మాజానికి చికిత్స చేసేందుకే ఆయ‌న ఉద్యమ‌బాట ప‌ట్టాడు.

ప‌రిస్థితుల్ని చూసి పారిపోకండి. స్వతంత్ర పోరాటం న‌డిపింది కూడా ఓ బ‌ల‌మైన విద్యార్ధి వ్యవ‌స్థే. నాకు రాజ‌కీయం వ్యాపారం కాదు బాధ్యత‌. నేను మాట‌లు చెప్పను చేసి చూపిస్తాను. మార్పు మొద‌ల‌వ్వాలంటే ముందు ఎవ‌రో ఒక‌రు మొద‌లుపెట్టాలి. న‌డిచి చూపించాలి. ఆ ఒక్కడినే నేను. నేను వెళ్లిన‌ దారికి నా అభిమానులు పెట్టిన పేరు ప‌వ‌నిజం. నా మీద విమ‌ర్శలు చేయాలంటే నా ప్రత్యర్ధులు రెండే విష‌యాలు చెబుతారు. ఒక‌టి చ‌దువు లేదు అని, రెండు నా వ్యక్తిగ‌త జీవితం అని పవన్ చెప్పుకొచ్చారు.

More News

5కోట్ల మంది మహిళలు చంద్రబాబుగారి బొమ్మలే!

దివ్యవాణి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. బహుశా సినిమాల్లో ఉన్నప్పుడు ఈమె పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ..

పూర్ణ‌, శ్రావ‌ణిల ప్ర‌యాణ‌మే 'మ‌జిలీ'

నిజ జీవితంలో పెళ్లి చేసుకున్న హీరో నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'మ‌జిలీ'. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి

రాయలసీమ పూర్వ వైభవం తెచ్చే బాధ్యత నాదే..

"రాయ‌ల‌సీమ చ‌దువుల నేల‌. అన్నమయ్య, వెంగ‌మాంబ‌, వీరబ్రహ్మేంద్రస్వామి, పీర్ బాబా వంటివారు తిర‌గాడిన నేల‌. ఇలాంటి నేల‌కు ముఠా, వ‌ర్గ పోరుతో కొన్నికుటుంబాలు

చంద్రబాబు దమ్ముంటే ఎదుర్కో..: కేటీఆర్ సవాల్

గత మూడ్రోజులుగా జరుగుతున్న డేటా వార్ తెలంగాణ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని అటు టీడీపీ.. ఇటు వైసీపీ రెండు ప్రధాన పార్టీలూ సీరియస్‌గా తీసుకున్నాయి.

మ‌హేష్ మూవీ టైటిల్ `వాట్స‌ప్‌`?

మ‌హేష్ నెక్స్ట్ మూవీ గురించి సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెక్క‌ర్లు కొడుతోంది. మ‌హేష్ ఇప్పుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌హ‌ర్షి` చిత్రంలో న‌టిస్తున్నారు.