పవర్ స్టార్ వెర్షెస్ స్టైలీష్ స్టార్..
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతికి నందమూరి హీరోలు బాలకృష్ణ డిక్టేటర్ - ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో...చిత్రాలు ఒకరోజు గ్యాప్ లో పోటీపడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మెగా హీరోలు పోటీపడుతున్నట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా సరైనోడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. బోయపాటి స్టైల్ లో ఉన్న ఈ పోస్టర్ కి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి...ఏప్రిల్ 8న పవన్ సర్ధార్, బన్ని సరైనోడు రెండు చిత్రాలు రిలీజ్ అవుతాయా..? లేక ఎవరో ఒకరు రిలీజ్ డేట్ మార్చుకుంటారా అనేది చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments