‘వకీల్‌సాబ్’ ట్రైలర్ రికార్డ్.. భారీగా పెరిగిన అంచనాలు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 9న సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ అంచనాలను మరింతగా పెంచేసింది ట్రైలర్. ఏ తెలుగు సినిమా సాధించని రికార్డును వకీల్‌సాబ్ ట్రైలర్ సాధించింది. వివరాల మేరకు ఈ ట్రైలర్ 21 మిలియన్ పైగా వ్యూస్‌ను దక్కించుకోగా.. వన్ మిలియన్ లైక్స్‌ను దక్కించుకుంది. 24 గంటలు గడవక ముందే ఈ రికార్డ్‌ను సాధించడం విశేషం.
బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్ పాత్రలో పవన్‌కళ్యాణ్ నటించారు. మూడేళ్ల తర్వాత పవన్‌కళ్యాణ్ నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రుతిహాసన్ గెస్ట్ పాత్రలో హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com