సాలిడ్ టీఆర్పీ నమోదు చేసిన వకీల్ సాబ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ఈ ఏడాది విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా పరిస్థితుల్లో కూడా బిగ్ స్క్రీన్ పై అఖండ విజయం సొంతం చేసుకున్న వకీల్ సాబ్ ఆ జోరును బుల్లితెరపై కూడా కొనసాగించింది.
జూలై 18న వకీల్ సాబ్ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్ లో తొలిసారి బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు వకీల్ సాబ్ చిత్ర ఈ సందర్భంగా సాలిడ్ టిఆర్పి నమోదు చేసుకుంది. వకీల్ సాబ్ మూవీ 19.2 టిఆర్పి రేటింగ్ నమోదు చేయడం విశేషం. వకీల్ సాబ్ చుట్టూ నెలకొన్న పరిస్థితుల్లో ఈ రేటింగ్ సాలిడ్ అనే చెప్పొచ్చు.
వకీల్ సాబ్ మూవీ థియేటర్స్ లో కేవలం రెండు వారాలు మాత్రమే ప్రదర్శించబడింది. కేవలం నాలుగు వారాల్లోపే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడం మొదలు పెట్టింది. ప్రైమ్ లో వకీల్ సాబ్ చిత్రానికి భారీ స్థాయిలో వ్యూస్ నమోదయ్యాయి.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే వకీల్ సాబ్ మూవీ అద్భుతమైన రేటింగ్ నమోదు చేసినట్లు భావించవచ్చు. మంచి టిఆర్పి నమోదు కావడంతో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలు పెట్టారు.
పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ ఈ చిత్రాన్ని బెస్ట్ మ్యూజిక్ అందించాడు. తమన్ సంగీతం సినిమాని మరో స్థాయికి చేర్చింది. దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో తొలిసారి నిర్మించిన చిత్రం ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com