‘మా బంగారు తల్లి స్వప్నకి..’ అంటూ పవన్ ట్వీట్..
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్వప్న అనే యువతికి రెండు చేతులూ లేవు. అయినప్పటికీ పవన్‌పై ఉన్న అభిమానంతో ఆయన బర్త్‌డే సందర్భంగా నోటితో పవన్ బొమ్మను గీసి.. దానిని చూపిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.. అద్భుతంగా వచ్చిన ఆ పెయింటింగ్‌ను జనసేన అధినేతకు ఆ పార్టీ నేతలు చూపించారు.
ఆ పెయింటింగ్‌ను చూసి పవన్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. స్వప్న విశాఖకు చెందిన యువతి అని తెలుసుకుని విశాఖ వచ్చినప్పుడు ఆమెను కలుస్తానని ట్విట్టర్ వేదికగా పవన్ మాట కూడా ఇచ్చారు. ‘‘మా బంగారు తల్లి స్వప్నకి, నువ్వు వేసిన నా డ్రాయింగ్.. నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ!’’ అని పవన్ ట్వీట్ చేశారు.
అయితే పవన్ బొమ్మను గీసిన అనంతరం స్వప్న దానిని చూపిస్తూ ఓ వీడియో సందేశం ద్వారా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ‘‘హాయ్ అన్నయ్య.. నా పేరు స్వప్న. నీ బర్త్‌డే స్పెషల్‌గా నేను ఈ పెన్సిల్ డ్రాయింగ్ నోటితో గీశాను. మరోసారి హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్యా’’ అని స్వప్న వీడియోలో తెలిపింది.
మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్
— Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020
నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ! pic.twitter.com/i3RrOxGR1U
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments