పవన్ - త్రివిక్రమ్ - నితిన్ మూవీకి వెరైటీ టైటిల్..!
Wednesday, December 7, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యువ హీరో నితిన్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి లిరిక్ రైటర్ టర్నడ్ డైరెక్టర్ కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ నిర్మాణంతో పాటు ఈ చిత్రానికి మూల కథను అందించడం విశేషం. ఈ చిత్రాన్ని పవన్ , త్రివిక్రమ్ తో కలిసి నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నారు. ఇక టైటిల్ విషయానికి వస్తే...లై అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇంగ్లీషులో LIE అని రాసే ఈ టైటిల్ కు లవ్ ఈజ్ ఎండ్ లెస్ అనేది ట్యాగ్ లైన్. టైటిల్ నిజంగానే వెరైటీగా ఉంది. మరి...నితిన్ ఇమేజ్ కి తగ్గట్టు ప్రేమకథగా రూపొందే ఈ చిత్రం నితిన్ కి మరో ఘన విజయాన్ని అందిస్తుందేమో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments