పవన్ త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ వాయిదా..!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నారు. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న కాటమరాయుడు చిత్రం పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం జనవరికి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది అని సమాచారం. ఇదిలా ఉంటే...ఈ మూవీ తర్వాత పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను ఈనెలలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఆతర్వాత డిసెంబర్ కాదు జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఇక ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే....కాటమరాయుడు చిత్రం జనవరికి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆతర్వాత ఫిబ్రవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com