ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వాయిదా..!

  • IndiaGlitz, [Friday,December 16 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నారు. డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న కాట‌మ‌రాయుడు చిత్రం పొల్లాచ్చిలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం జ‌న‌వ‌రికి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది అని స‌మాచారం. ఇదిలా ఉంటే...ఈ మూవీ త‌ర్వాత ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను ఈనెల‌లోనే ప్రారంభించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆత‌ర్వాత డిసెంబ‌ర్ కాదు జ‌న‌వరి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నారు అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే....కాట‌మ‌రాయుడు చిత్రం జ‌న‌వ‌రికి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆత‌ర్వాత ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

More News

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడు..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూడ‌వ చిత్రం రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

విసారణై తో చాలా నేర్చుకున్నాం - ధనుష్

2017 ఆస్కార్ అవార్డ్స్ కు గాను ఇండియా తరుపున వెట్రీమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం విసారణై ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

రామ్ గోపాల్ వర్మ 'వంగ వీటి' చిత్రాన్నిడిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ద్శకత్వంలో రూపొందిన చిత్రం `వంగవీటి`. జీనియస్, రామ్లీల వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత దాసరి కిరణ్కుమార్ నిర్మాతగా రామదూత క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సెన్సేషనల్ మూవీ `వంగవీటి`.

హిలేరియస్ ఎంటర్ టైనర్ పిట్టగోడ చిత్రాన్ని ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం - డి.సురేష్ బాబు

విశ్వదేవ్ రాచకొండ,పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు సమర్పణలో

మిస్టర్ సెట్ లో లావణ్య బర్త్ డే సెలబ్రేషన్స్..!

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై...