మాదాపూర్ టు మియాపూర్.. మెట్రోలో ప్రయాణించిన పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధ్యక్షులు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు మెట్రోలో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది. మెట్రో సిబ్బంది సహా ప్రయాణికులంతా ఒక్కసారిగా మెట్రో స్టేషన్‌లో పవన్‌ను చూసి షాక్ అయ్యారు. పవన్ అందరినీ విష్ చేస్తూ వెళ్లి మెట్రో ట్రైన్ ఎక్కారు. ట్రైన్‌లో పలువురు ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రో నుంచి హైదరాబాద్ అందాలను పరిశీలిస్తూ ఖుషీ అయ్యారు. పవన్‌తో పాటు దిల్ రాజు కూడా మెట్రోలో ప్రయాణించారు. ప్రస్తుతం మెట్రోలో పవన్ ప్రయాణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మియాపూర్‌లో ‘వకీల్ సాబ్’ షూటింగ్ నిమిత్తం పవన్ మెట్రోలో ప్రయాణించారు.
కాగా.. పవన్ ఒక సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్‌లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్‌పేట స్టేషన్‌లో ట్రైన్ మారారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్‌లో పవన్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాలకు చెందిన పలువురు కూర్చొన్నారు. ముఖ్యంగా పవన్ ద్రాక్షారామానికి చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో ముచ్చటించారు.
చిన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవలి వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతిన్నదని పవన్‌కు చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది మీ అభిమానులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రయాణంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని సత్యనారాయణ చెప్పగానే.. పవన్ నవ్వుతూ.. ‘మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి’ అని అన్నారు.
ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఈ షూటింగ్ జరుగుతోంది. కాగా.. ఈ సినిమా షూటింగ్ నిమిత్తమే పవన్ మాదాపూర్ నుంచి మియాపూర్‌కు మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలో తీసిన పవన్ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. మొన్నటి వరకూ గుబురు గడ్డంతో కనిపించిన పవన్.. ప్రస్తుతం మాత్రం హెయిర్ స్టైల్ మార్చేసి.. గుబురు గడ్డాన్ని తొలగించి స్మార్ట్ లుక్‌లో కనిపిస్తున్నారు. పవన్ లుక్ చూసి అభిమానులు బాగా ఖుషీ అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com