రేపు రాజధానిలో జనసేనాని పర్యటన

  • IndiaGlitz, [Thursday,August 29 2019]

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యంపై భూములిచ్చిన రైతులు, ఆ ప్రాంత ప్రజల్లో నెలకొన్న ఆందోళన, వారి బాధలను తెలుసుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తేదీన రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. సమీకరణలో భాగంగా నాలుగేళ్ళనాడే భూములు తీసుకున్న ప్రభుత్వం అక్కడ చేపట్టిన పనులు ఏమిటి? వాటి స్థితిగతులేమిటి అనేది పరిశీలిస్తారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, ప్రభుత్వ భవనాలు, జ్యుడీషియరీ కాంప్లెక్స్ నిర్మాణం, ఎత్తిపోతల పథకం, సి.ఆర్.డి.ఏ. కార్యకలాపాలు ఏ దశలో ఉన్నాయో చూస్తారు. భూ సమీకరణలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, వాటిపై ఆధారపడి బతికిన వ్యవసాయ కూలీలను కలుస్తారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను వారిని అడిగి తెలుసుకుంటారు.

సమీకరణ సమయంలో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తున్నదీ విచారిస్తారు. 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ పర్యటన ఉంటుంది. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం నుంచి మొదలవుతుంది. 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో సమావేశం నిర్వహిస్తారు.

పర్యటన వివరాలు

30వ తేదీ ఉదయం 10 గంటలకు జనసేన పార్టీ కార్యాలయం, మంగళగిరిలో బయలుదేరుతారు. మంగళగిరి పాత బస్టాండ్ మీదుగా నిడమర్రు గ్రామం వెళ్తారు.

నిడమర్రు - కురగల్లు - ఐనవోలు, కొండవీటివాగు బ్రిడ్జ్, ఎస్.ఆర్.ఎమ్. యూనివర్సిటీ పరిశీలన

శాఖమూరు, విట్ యూనివర్సిటీ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ బిల్డింగ్స్ - శిల్పారామం - అంబేడ్కర్ స్మృతివనం - రిజర్వాయర్ పరిశీలన - ఎన్జీఓ క్వార్టర్స్ విజిట్ - హైకోర్టు - హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణ ప్రదేశ పరిశీలన - సచివాలయ భవనాల నిర్మాణ స్థలం పరిశీలన – న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల నిర్మాణ ప్రదేశం - ఐ.ఏ.ఎస్., ఎమ్మెల్యేలు నివాసం టవర్స్

అనంతవరం గ్రామం, ఎన్.17 రోడ్ – అనంతవరం, ఎన్.16 రోడ్ – దొండపాడు – సీడ్ యాక్సిస్ రోడ్ - సి.ఆర్.డి.ఏ. బిల్డింగ్స్ – లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిశీలన.

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిశీలనతో 30వ తేదీన శ్రీ పవన్ కల్యాణ్ గారి పర్యటన ముగుస్తుంది.