రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ప‌వ‌న్‌

  • IndiaGlitz, [Tuesday,January 14 2020]

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ దాదాపు ఖరారైపోయింది. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ... కథా బలం ఉన్న సినిమాల్లో నటించాలన్నది పవన్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న హిందీ సినిమా ‘పింక్’ రిమేక్‌లో ఆయన నటించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఆయన షెడ్యూల్ ప్రారంభం కానుందని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్టార్ డైరెక్టర్ క్రిష్‌తో పవర్ స్టార్ ఓ సినిమా చేయనున్నట్టు కూడా వార్త‌లు విన‌ప‌డుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాను స్వాతంత్ర్యం రాక ముందు కాలంలో ఓ పేద‌ల‌కు సాయ‌ప‌డే ఓ రాబిన్ హుడ్ లాంటి పాత్ర‌లో ప‌వ‌న్ క‌నిపించ‌బోతున్నార‌ట‌.

ప‌వ‌న్ ఇమేజ్‌ను, ఆయ‌న రాజ‌కీయ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్ట‌ర్ క్రిష్ సినిమా క‌థ‌ను తయారు చేశాడుట‌. భారీ సెట్స్‌లో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారని టాక్‌. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాను ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు లోలోప‌ల చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయ‌ట‌. అయితే ప‌వ‌న్ ఎంట్రీ సినిమాల్లోకి ఎప్పుడు ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎక్కువ కాల్షీట్స్ కాకుండా ప‌వ‌న్ త్వ‌రత్వ‌ర‌గా సినిమాల‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నాడ‌ని, కాబ‌ట్టి ఎక్క‌డా స‌మ‌యం వృథా అయ్యే ప్ర‌స‌క్తి లేద‌ని తెలుస్తుంది.

More News

‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ అరుదైన రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి సంద‌ర్భంగా

వెంక‌టేశ్ 'అసుర‌న్‌' కి ముహూర్తం కుదిరింది

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా న‌టించిన చిత్రం `అసుర‌న్‌`. వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

న‌వ‌ల ఆధారంగా హీరో సూర్య సినిమా

త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.

ఈ మూడ్రోజుల్లో 3 రాజధానులపై తేలిపోనుంది!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపు వ్యవహారంపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

బొంబాట్‌లో `ఇష్క్ కియా...' సాంగ్‌ను విడుద‌ల చేసిన ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

క‌ళ్ల‌లోన దాచినానులే.. రెప్ప‌దాటి పోలేవులే కాటుకైన పెట్ట‌నులే.. నీకు అంటుకుంటుంద‌ని