సర్ధార్ సెట్సలో పవన్...

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌కుడు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌. ప‌వ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్కు చాలా మంచి స్పంద‌న ల‌భించింది. పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్ రేప‌టి నుంచి స‌ర్ధార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈ షూటింగ్ లో ప‌వ‌న్ తో పాటు మెయిన్ విలన్స్ లో ఒకరైన కబీర్ దుహ సింగ్ కూడా పాల్గొంటాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. రేప‌టి నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ప‌వ‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ తో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో..