అఖిల్ ఆడియోకి పవన్ వస్తున్నాడట...

  • IndiaGlitz, [Tuesday,September 15 2015]

అక్కినేని వంశం మూడోత‌రం నుంచి వ‌స్తున్న మ‌రో యువ క‌ధానాయ‌కుడు అఖిల్ అక్కినేని. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నితిన్ అఖిల్ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అక్కినేని జ‌యంతి నాడు ఈ నెల 20న అఖిల్ ఆడియోను ఘ‌నంగా రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే అఖిల్ ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం కు ముఖ్య అతిధిగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రుకానున్న‌ట్టు స‌మాచారం.

గ‌త కొన్ని రోజులుగా అఖిల్ ఆడియో వేడుక‌కు ప‌వ‌న్ ముఖ్య అతిధి అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత ప‌వ‌న్ బిజీగా ఉండ‌డం వ‌ల‌న అఖిల్ ఆడియోకు రావ‌డం లేదంటూ మ‌రో వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఫైన‌ల్ గా మాకు అందిన స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్ అఖిల్ ఆడియో వేడుక‌కు ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతున్నాడ‌ట‌. నితిన్ కి నిర్మాత‌గా తొలి చిత్రం కావ‌డం, అలాగే అఖిల్ తొలి చిత్రం కావ‌డం...నాగార్జున కూడా స్వ‌యంగా ప‌వ‌న్ ని ఆహ్వానించ‌డంతో ప‌వ‌న్ ఓకె అన్నాడ‌ట‌. అది సంగ‌తి.

More News

వెంకీ కూతురుగా సమంత...?

బాలీవుడ్ హిట్ మూవీ పీకు.ఈ చిత్రంలో అమితాబ్ తండ్రిగా నటించగా దీపిక పడుకునే కూతురుగా నటించింది.

రామ్ చరణ్ చిత్రంలో డిల్లీ భామ...

రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం బ్రూస్ లీ.

ఇప్పుడు మలయాళంలో....

ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు ఉన్నట్టుండి యుటర్న్ తీసుకుని'లెజెండ్'సినిమాతో విలన్ గా అవతారం ఎత్తాడు.

నాగ్ , కార్తీ ల మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్...

నాగార్జున,కార్తీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

చైనాలో ప్రభాస్ సందడి

‘బాహుబలి’ సినిమా రిలీజ్ తర్వాత తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజం చెప్పాలంటే ఓ రకంగా ఊపిరి లూది సినిమా స్పాన్ పెరిగేలా చేసింది.