రెండుచోట్ల ఓటమికి కారణం కనుగొనే పరిష్కారం దిశగా పవన్!

  • IndiaGlitz, [Friday,August 02 2019]

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమిపాలైన విషయం విదితమే. పార్టీ అధ్యక్షుడే ఓడిపోయారంటే ఆషామాషీ విషయమేం కాదు.. అంతేకాదు రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ ఒక్క చోట కూడా గెలవకపోవడమేంటి..? ఎందుకిలా జరిగిందనేది పవన్ కల్యాణ్‌కు సైతం అంతుచిక్కని విషయం. అయితే అసలు లోపం ఎక్కడ జరిగింది..? మన ముందున్న సమస్యలేంటి..? అని వాటికి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు జనసేనాని ముందడుగేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదీ అసలు కారణం!

జనసేన రెండు చోట్లా అట్టర్ ప్లాప్ అవ్వడానికి కొన్ని మీడియా సంస్థలని కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.! ఎన్నికల సీజన్ అంతా సోషల్ మీడియా.. 99టీవీ చానెల్ తప్ప ఆయన వెంట ఏ పెద్ద చానెల్స్ నడవలేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో శ్రీరెడ్డి.. పవన్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించిన తర్వాత నెలకొన్న పరిస్థితులన్నీ ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఈ సందర్భంలో పవన్ తీవ్ర ఆగ్రహంతో సహనం కోల్పోయి కొన్ని ప్రధాన మీడియాలపై తిట్లదండకంతో బ్యాన్ విధించి పరువు నష్టం దావా కూడా వేశారు. అంతేకాదు తన అభిమానులు, కార్యకర్తలెవ్వరూ ఫలానా.. చానెళ్లను చూడొద్దని డైరెక్ట్‌గానే పవన్ చెప్పేశారు. దీంతో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది.

ఒక మెట్టు దిగి సమస్యకు పరిష్కారం!

అయితే ఇక్కడే జనసేనాని అట్టర్ ప్లాప్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రధాన మీడియా చానళ్లతో గొడవలే తమ పుట్టి ముంచాయని పవన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా మీడియాకు తాను దూరం కావడం తన ఓటమికి కారణమని భావించిన ఆయన ఇకపై మీడియాతో సఖ్యతగా ఉండాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. అయితే తాను ఏ మీడియా యాజమాన్యాలతో అయితే గొడవకు దిగి బ్యాన్ చేశానో.. ఒక మెట్టు దిగి మరీ.. స్వయంగా తానే కార్యాలయాలకు వెళ్లి యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకునేందుకు పవన్ ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించినట్లు వార్తలు వస్తున్నాయి.

మంచి పరిణామమే పవన్!

అయితే పవన్ ఇలా అడుగులేయడం మంచి పరిణామమే.. ఎంతైనా మీడియా మీడియానే కదా. మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదు.. అన్న విషయం కాస్త ఆలస్యంగా పవన్‌కు బాగానే తెలిసొచ్చిందన్న మాట. మీడియాతో వివాదాల కంటే సఖ్యేత మంచిది.. పవన్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యి అన్ని మీడియా సంస్థలతో కలిసి మెలిసి ఉండటం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More News

చిరు-కొరటాల చిత్రంలో డబుల్‌ రోల్.. ఒక పాత్ర రివీల్!

మెగాస్టార్ చిరంజీవీ రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన రెండో చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డి. త్వరలోనే ‘సైరా’ను మెగాభిమానులు, సినీ ప్రియుల ముందుకు...

వెంకీ మామ: మామ, అల్లుడు అదరగొట్టేశారు!

క్రేజీ కాంబినేషన్ వెంకటేష్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. దర్శకుడు కేఎస్‌ రవీంద్ర అలియాస్ బాబీ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మేకింగ్ విడుదల చేసింది. కాగా..

ఆగస్ట్ 9న మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ఫ్రైజ్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్ట్-09 అన్న విషయం తెలిసిందే. నిజంగా ఇది మహేశ్ అభిమానులు పెద్ద పండుగ రోజే. ఆ రోజు ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా...

నాగ్ దెబ్బకు ఎన్టీఆర్ రికార్డ్ బద్దలైందిగా!!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-1 జూనియర్ ఎన్టీఆర్‌తో, సీజన్-2 నేచురల్ స్టార్ నానితో.. మూడో సీజన్‌ను అక్కినేని నాగార్జునతో ‘మా’ టీవీ యాజమాన్యం, నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేశారు.

ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఇన్‌టెన్సివ్ థ్రిల్ల‌ర్ 'రాక్ష‌సుడు': బెల్లంకొండ శ్రీనివాస్‌

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా 'రైడ్‌', 'వీర' చిత్రాల దర్శకుడు రమేష్‌వర్మ పెన్మత్స