అమెరికాలో అరెస్టయిన విద్యార్థుల కోసం పవన్ పోరాటం!
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికాలోని ఓ ఫేక్ యూనివర్శిటీలో తప్పుడు సర్టిఫికెట్ల ద్వారా అడ్మిషన్ పొందిన తెలుగు విద్యార్థులను యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉండే డాలర్ డ్రీమ్స్‌ను సొమ్ము చేసుకునేందుకు హైదరాబాద్ మహానగరంలో లెక్కకు మిక్కిలిగా నకిలీ కన్సల్టెన్సీలు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది. దీంతో ఆ విద్యార్థుల కటుంబీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులను విడుదల చేయాలని అమెరికా అధికారులు, సంబంధిత సంప్రదించి విడుదల చేయాలని కోరడం జరిగింది.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికాలో అరెస్ట్ అయిన భారతీయ విద్యార్థుల కోసం పోరాటం ప్రారంభించారు!. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా జనసేనాని స్పందిస్తూ.. ఇమిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించి విడుదల చేయించేందుకు అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ తీసుకోవాలని కోరారు.
" ఆ దేశానికి ఎంఎస్ చదివేందుకు వెళ్లి కేసుల్లో చిక్కుకోవడంతో వారి కన్నవారు ఆందోళనలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారనే వార్తలు బాధ కలిగిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వమే మిషిగన్ రాష్ట్రంలో నకిలీ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి ట్రాప్ చేసి చేరిన విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం విచారకరం. ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు అవసరైన సాయాన్ని అందించాలని ఎన్నారై జనసేన ప్రతినిధులను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కళాశాల దశ నుంచే అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన బాధ్యతను విద్యా శాఖతోపాటు కళాశాలలు తీసుకోవాలి" అని పవన్ స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే ఫాతిమా విద్యార్థుల కోసం పలుమార్లు పవన్ పోరాటం చేసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout