పవన్ దీక్ష...

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు వారికి అండగా దీక్ష చేపట్టనున్నాడని సమాచారం. అది కూడా తమిళనాడు దీక్ష చేయనుండటం కొసమెరుపు. తమిళనాట నిర్భంద తమిళ భాషా చట్టం రూపొందడంతో అక్కడ ఉన్న మైనారీటీలు తమ భాషను నేర్చుకోవడం కష్టమైపోతుంది.

ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్టు సమారం. తమిళనాడులో తెలుగు సహా ఇతర మైనారిటీ భాషలకు సపోర్ట్ ఇస్తూ వచ్చే నెల 10వ తేదిన హోసూరులో ఓ దీక్షను చేపట్టనున్నాడని టాక్. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పవన్ కళ్యాణ్ బేటీ అవుతారని కూడా సమాచారం. మరి దీనికి సంబంధించి పవన్ శిబిరం నుండి ఎటువంటి వార్త వెలువడలేదు. మరి పవన్ నిజంగానే చొరవ చూపితే మంచి విషయమే అని చెప్పవచ్చు.