పవన్‌తో త్రివిక్రమ్ మళ్లీ ఆ పని చేయిస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇది పవన్ 25వ చిత్రం. కాగా ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ ఓ పాట పాడబోతున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. గతంలో 'జాని', అత్తారింటికి దారేది` వంటి చిత్రాల్లో పవన్ పాడిన పాటలు సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే.
దీన్ని దృష్టిలో ఉంచుకొని త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా పాట పాడించాలని డిసైడ్ అయ్యాడట. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. 'కొడకా కోటేశ్వరా..' అంటూ సాగే పాటను పవన్ పాడతారని తెలుస్తోంది. అనిరుధ్ చేసిన 'వై దిస్ కొలవరి' తరహాలోనే ఈ పాట కూడా వుంటుందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com