ప‌వ‌న్‌తో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ ఆ ప‌ని చేయిస్తాడా?

  • IndiaGlitz, [Tuesday,November 21 2017]

జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు అజ్ఞాత‌వాసి అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇది ప‌వ‌న్ 25వ చిత్రం. కాగా ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ ఓ పాట పాడబోతున్నారని ఇండ‌స్ట్రీలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. గతంలో 'జాని', అత్తారింటికి దారేది' వంటి చిత్రాల్లో పవన్ పాడిన పాటలు సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే.

దీన్ని దృష్టిలో ఉంచుకొని త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా పాట పాడించాలని డిసైడ్ అయ్యాడట. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. 'కొడకా కోటేశ్వరా..' అంటూ సాగే పాటను పవన్ పాడతారని తెలుస్తోంది. అనిరుధ్ చేసిన 'వై దిస్ కొలవరి' తరహాలోనే ఈ పాట కూడా వుంటుందని తెలుస్తోంది.