అభిమానులకు అండగా నిలిచిన వారికి పవన్ థాంక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం, శాంతిపురం మండలంలో, పవన్ కటౌట్ కడుతున్న అభిమానులకు విద్యుత్ ఘాతం తగిలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అభిమానులు చనిపోగా, నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. వీరికి పవన్ సహా పవన్‌తో సినిమా చేస్తున్న నిర్మాతలు, మెగా హీరోలు రామ్‌చరణ్, బన్నీ ఆర్థిక సాయాన్ని అందించారు. దీనిపై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన రాంచరణ్‌కి.. అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన అల్లు అర్జున్‌కి,నిర్మాతలు దిల్ రాజు, ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ నవీన్ గారికి నా కృతజ్ఞతలు’’ అని పవన్ ట్వీట్ చేశారు.
చనిపోయిన అభిమానులకు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరపున ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆ వెంటనే వకీల్ సాబ్ నిర్మాతలు సహా మైత్రీ మూవీస్ సంస్థ, పవన్‌తో 27వ సినిమా చేస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థలు కూడా ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. అల్లు అర్జున్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని అందించగా.. రామ్‌చరణ్ రెండున్నర లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి; అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి,నిర్మాతలు - శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు??.
— Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com