పవన్ టీజర్ డేట్ మారింది...

  • IndiaGlitz, [Thursday,January 12 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'కాట‌మ‌రాయుడు'. సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌గా న‌టిస్తుంటే క‌మ‌ల్ కామ‌రాజు, శివ‌బాలాజీ, చైత‌న్య‌కృష్ణ‌లు ప‌వ‌న్ త‌మ్ముళ్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్నిడైరెక్టర్ కిషోర్ పార్థసాని(డాలీ) వీలైనంత త‌ర్వగా పూర్తి చేసి ఉగాది కానుక‌గా మార్చి 29న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌ను సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేస్తున్నార‌ట‌. సంక్రాంతికి డిజిట‌ల్ పోస్ట‌ర్‌ను మాత్ర‌మే విడుద‌ల చేస్తార‌ట‌.