పవన్ సర్‌ప్రైజ్ రేపే
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ టైటిల్ పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. బోనీకపూర్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా.. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి 3.5 మిలియన్స్ పైగా లైక్స్ వచ్చాయి. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామని చిత్ర యూనిట్ తెలియజేస్తూ ఓ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.
మహిళల గొప్పతనాన్ని తెలియజేసేలా ‘మగువా మగువా..’ అంటూ సాగే ఈ పూర్తి పాటను రేపు విడుదల చేయనున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.. తమన్ సంగీతాన్ని అందించారు. బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ వకీల్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాను మే 15న విడుదల చేయబోతున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తన తదుపరి చిత్రం షూటింగ్‌లో కూడా పవన్ రేపటి నుండే పాల్గొనబోతున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com