పవన్ , సూర్య.. ఓ ఆసక్తికరమైన విషయం

  • IndiaGlitz, [Thursday,January 04 2018]

కేర‌ళ కుట్టి కీర్తి సురేష్ తెలుగు, త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంక్రాంతికి ఈ ముద్దుగుమ్మ న‌టించిన రెండు చిత్రాలు తెర‌పైకి రానున్నాయి. వాటిలో ఒక‌టి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి జోడీగా న‌టించిన అజ్ఞాత‌వాసి కాగా.. మ‌రొక‌టి సూర్యకి జోడీగా న‌టించిన త‌మిళ అనువాద చిత్రం గ్యాంగ్‌. ఈ రెండు సినిమాలు కూడా రెండు రోజుల గ్యాప్‌లో రానున్నాయి. ఈ రెండు సినిమాల‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పింది కీర్తి.

అదేమిటంటే.. కీర్తి త‌ల్లి మేన‌క కూడా ఒక‌ప్పుడు క‌థానాయిక అన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు చిరంజీవితో పున్న‌మినాగులో ఓ పాట కోసం మేన‌క న‌టించింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు చిరు త‌మ్ముడు ప‌వ‌న్‌తో కీర్తి జోడీ క‌ట్టింది. ఇక సూర్య విష‌యానికి వ‌స్తే.. అత‌ని తండ్రి శివ‌కుమార్‌తో మేన‌క మూడు సినిమాలు చేసింది. ఇప్పుడు కీర్తి ఏమో.. సూర్య‌తో సినిమా చేసింది. మొత్తానికి.. నిన్న‌టి త‌రం క‌థానాయ‌కుల‌తో త‌ల్లి మేన‌క న‌టిస్తే.. అదే ఫ్యామిలీకి చెందిన‌ ఈ త‌రం క‌థానాయ‌కుల‌తో కూతురు కీర్తి న‌టించింద‌న్న‌మాట‌.