కాపు రిజర్వేషన్లపై స్పందించిన పవన్.. కేసీఆర్‌కు సూచన
Send us your feedback to audioarticles@vaarta.com
కాపు కార్పొరేషన్‌కు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కోరారు. కాపు రిజర్వేషన్ అంశంతో పాటు ఏపీలో విద్య, వైద్యంపై పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘కాపు కార్పొరేషన్‌కు సంబంధించినవే కాకుండా ఇతర సామాజిక వర్గాలకు విడుదల చేసిన ఫండ్స్ దుర్వినియోగమవుతున్నాయి. అసలైన వారికి చేరట్లేదు. అందుకే అన్ని వర్గాలకు విడుదల చేస్తున్న ఫండ్స్‌పై శ్వేత పత్రం కోరాను. కాపు రిజర్వేషన్లు ఇవ్వబోమని సీఎం జగన్ ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పారు. అయినా ప్రజలు గెలిపించారు. ిదే విషయాన్ని ప్రజలకు మరోసారి స్పష్టం చేస్తే బాగుంటుంది. అలాగే శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి’’ అని పవన్ పేర్కొన్నారు.
ఏపీలో ప్రస్తుతం విద్యావ్యవస్థ గురించి పవన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది విద్యాసంస్థలేవీ ప్రారంభం కాలేదన్నారు.. కాస్త ప్రైవేటు విద్యాసంస్థలైనా ఆన్‌లైన్ పేరుతో క్లాసులు నడుపుతున్నాయని.. గవర్నమెంటు పాఠశాలల్లో అదీ లేదని పేర్కొన్నారు. అయితే పిల్లలు ఎక్కుగా కంప్యూటర్ ముందు కూర్చొన్నా కూడా అది కూడా దుష్పరిణామాలకు దారి తీస్తుందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించి.. అసలు పిల్లలంతా ఈ విద్యా సంవత్సరం లాస్ అవుతారా? లేదంటే ఏవైనా ప్రత్యామ్నాయం ఉంటుందా? తదితర విషయాలను వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతకు ముందు పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే బస్సులు ఎక్కి వెళ్లాల్సి వచ్చేది కానీ ప్రస్తుతం ఏ ఖర్చూ లేకుండా ప్రైవేటు పాఠశాలలు అదే ఫీజును వసూలు చేయడంపై తనకు కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు.
ఆసుపత్రుల విషయమై పవన్ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వలేదు. ఇంగ్లండ్‌లో గవర్నమెంట్ హాస్పిటళ్లు ఎంత బలంగా పని చేస్తాయో అలాంటి బలమైన వ్యవస్థను మనం తీసుకురావడంతో కొన్ని దశాబ్దాలుగా విఫలమయ్యాం. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ.. ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ.. ఆసుపత్రుల ప్రక్షాళన చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల నుంచి నాకు చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. కరోనా విషయమై ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కరోనాపై దృష్టి సారించాలి. కరోనాపై ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ప్రజలే జాగ్రత్తగా ఉండాలి’’ అని పవన్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments