పరిస్థితుల్ని పాట రూపంలో చెప్పిన ఆదివాసీలు.. చలించిపోయిన పవన్

  • IndiaGlitz, [Thursday,December 24 2020]

మూడేళ్ల అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త విరామమిచ్చి సినిమాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ అనంతరం ‘వకీల్‌సాబ్’ షూటింగ్ మొదలు పెట్టింది మొదలు.. వరుసగా సినిమాలకు సైన్ చేసేశారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్ అరకులో జరుగుతోంది. దీని కోసం అరకు వెళ్లిన పవన్.. షూటింగ్ విరామ సమయంలో అక్కడి ఆదివాసీలతో మాట్లాడారు. వారి కష్ట సుఖాలతో పాటు జీవన స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనినంతటినీ ట్విట్టర్ వేదికగా పవన్ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ఒక పాట రూపంలో తమ పరిస్థితుల్ని పవన్‌కు వివరించారు. అది విన్న పవన్ చలించిపోయారు.

ఆదివాసీలు పాడిన పాటను విన్న పవన్ తనకు ‘వనవాసి’ పాట గుర్తుకు వచ్చింది. ‘‘నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో.. అరకు ఆదివాసీల, ఆంధ్ర-ఒరియాలో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట.. (వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన 'వనవాసి' గుర్తుకువచ్చింది)’’ అంటూ ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అరకు పర్యటనలో ఆదివాసీల జీవన పరిస్థితులు బాధ కలిగించాయని వెల్లడించారు. ఆదివాసీల సంస్కృతి పరిరక్షింపబడాలని.. వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావటానికి జనసేన - జనసైనికులు నిరంతరం వారికీ అండగా ఉంటారని పవన్ వెల్లడించారు.

More News

అభిజీత్ కంటే ముందుగా..వెండితెర‌పైకి సోహైల్ ..!

బిగ్‌బాస్ 4లో అభిజీత్ విన్న‌ర్‌గా, అఖిల్ రన్న‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ మూడో స్థానంలో నిలిచిన సోహైల్ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకున్నాడు.

మరో ప్రమాదకరమైన మహమ్మారి గుర్తింపు..

కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తుంటే అంతకంటే ప్రమాదకరమైన మరో రకం కరోనా వైరస్‌ను గుర్తించినట్టు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్‌ హ్యాన్‌కాక్‌ బుధవారం వెల్లడించారు.

ఫంటాస్టిక్ తార’కు బ్రాండ్ అంబాసిడర్‌గా సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల ముద్దుల తనయ సితార ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కేసు వెన‌క్కి తీసుకున్న ఇళ‌య‌రాజా..!

చెన్నై ప్ర‌సాద్ స్టూడియో అధినేత‌ల‌పై పెట్టికేసుని వెన‌క్కి తీసుకున్నారు ఇసైజ్ఞాని ఇళ‌య‌రాజా .

యూకే నుంచి తెలంగాణకు 1200 మంది రాక..

కరోనా కొత్త స్ట్రెయిన్‌పై తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.