చంపుకునే స్ధాయిలో అభిమానం ఉండకూడదు - పవన్ కళ్యాణ్..!

  • IndiaGlitz, [Thursday,August 25 2016]

ఇటీవ‌ల క‌ర్నాట‌క‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని వినోద్ రాయ‌ల్ హ‌త్య‌కు గురయ్యారు. ఈ విష‌యం తెలుసుకుని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు ఉద‌యం తిరుప‌తి వెళ్లి వినోద్ రాయ‌ల్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ...అభిమానం అనేది ఒక‌రినొక‌రు చంపుకునే స్ధాయిలో ఉండ‌కూడ‌దు. వినోద్ త‌ను చ‌నిపోతున్నాను అని తెలిసి త‌న క‌ళ్లును దానం చేయ‌మ‌ని చెప్పాడ‌ట. ఒక అభిమానిగానే కాకుండా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే వ్య‌క్తి చ‌నిపోవ‌డం బాధాక‌రం. ఇంజ‌నీరింగ్ చ‌ద‌వి అమెరికా వెళ్లాల‌నుకుటున్న టైమ్ లో ఇలా జ‌రిగి చ‌నిపోవ‌డం జ‌న‌సేన ఓ సైనికుడుని కోల్పోయింది. ఈ హ‌త్య‌కు కార‌ణ‌మైన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి అని పోలీసుల‌ను కోరుతున్నాను. ఈ కుటుంబానికి అన్నివిధాలా అండ‌గా ఉంటాను అన్నారు.