ఇంటర్నెట్ లో అకీరా వీడియో దుమారం.. తండ్రిలాగే కొడుకు కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు అభిమానులకు గుర్తుకు వచ్చేది మార్షల్ ఆర్ట్స్. కెరీర్ ఆరంభంలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో కొంతవరకు శిక్షణ తీసుకున్నారు. తన సినిమాల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ ని పవన్ చేశారు. పవన్ కి క్రేజ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం అయింది.
ఇదీ చదవండి: బ్రతికున్నందుకు జీవితాంతం బాధపడతా: యషిక ఆనంద్
లేటెస్ట్ గా పవన్ తనయుడు అకీరా నందన్ వీడియో ఒకటి దుమారం రేపుతోంది. ఈ వీడియో చూస్తుంటే అకీరా కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు ఉన్నాడు. కర్రసాములో కర్రని వేగంగా తిప్పుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ వీడియోని రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. టీనేజ్ లోనే ఆరడుగులు దాటేసిన అకీరా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ వీడియో చూశాక పవన్ అభిమానుల రచ్చ సోషల్ మీడియాలో మరింత ఎక్కువైంది. తండ్రి లాగే కొడుకు కూడా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అకీరా త్వరగా సినిమాల్లోకి వచ్చేయాలని కోరుతున్నారు. అంతే కాదు.. అనదర్ స్టార్ ఇన్ మేకింగ్ అని.. అకీరా ఎవరి డైరెక్షన్ లో లాంచ్ అయితే బావుంటుందో కూడా ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జానీ 2 టైటిల్ తో అకీరా ఫస్ట్ మూవీ ఉండాలని, ఆ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com