స్మార్ట్ లుక్‌తో పవన్.. వైరల్ అవుతున్న ఫోటో..

  • IndiaGlitz, [Wednesday,November 04 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో గుబురు గడ్డం.. ఒత్తైన జుట్టుతో కనిపించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలపాటు పవన్ చాతుర్మాస దీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ దీక్ష ఇటీవలే ముగిసింది. దీంతో పాటు ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ లుక్ అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. గుబురు గడ్డం, ఒత్తైన జుట్టు తీసేసి సరికొత్త లుక్‌లో పవన్ కనిపిస్తున్నారు.

పవర్ స్టార్ తాజా ఫోటో ఒకటి బయటకు వచ్చింది. తన స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో దిగిన ఫొటో అది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ స్మార్ట్ లుక్ కిర్రాక్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతోంది. అందులో పవన్ కూడా పాల్గొంటున్నారు. అందుకే పవన్ ఈ స్మార్ట్ లుక్‌లోకి మారిపోయారని టాక్. ‘వకీల్ సాబ్’లో పవన్ లుక్ ఇదేనని అభిమానులు భావిస్తున్నారు.

More News

స్వింగ్ రాష్ట్రాలు.. ట్రంప్ వెంటే...

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. క్షణక్షణానికి ఫలితం మారిపోతోంది.

మెగాస్టార్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య.

రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన జీవిత..

సీనియర్ నటుడు రాజశేఖర్ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవిషయం తెలిసిందే.

మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా బైడెన్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ జరగడం విశేషం.

బైడెన్.. ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలివే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.