పవన్ సరసన శృతి హాసన్..
Saturday, May 14, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఫాక్షన్ లీడర్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఆకుల శివ కథ - మాటలు అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జూన్ నుంచి ప్రారంభించనున్నారు. పవన్ - శృతి కలసి గబ్బర్ సింగ్ సినిమాలో నటించారు. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మరి...రెండోసారి జత కడుతున్న పవన్ - శృతి జంట ఈసారి కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments