పవన్ సిగ్గుపడాలి.. చంద్రబాబు వాటర్ బాటిల్స్ కనిపించవ్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మే-30న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు అధికారుల బదిలీలు.. టెండర్ల రద్దు.. డీజీపీ, ఐబీ అధికారుల మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్ల పెంపుపై జగన్ మొదటి సంతకం చేశారు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు భారీగా పెన్షన్లు పెంచడం జరిగింది. కాగా ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ ట్విట్టర్లో హడావుడి చేశారు.
అటు పవన్.. ఇటు చంద్రబాబుపై పరోక్షంగా కామెంట్స్!
"వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లను భారీగా పెంచి చరిత్ర సృష్టించింది. కిడ్నీ బాధితుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నవారంతా సిగ్గుపడాలి. కిడ్నీ బాధితులకు యువ ముఖ్యమంత్రి జగన్ ‘నేను చూశాను.. నేను ఉన్నాను’ అంటూ నెలకు రూ.10,000 అందజేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు యువ ముఖ్యమంత్రి కిడ్నీ బాధితులకు నెలకు పదివేల ఆసరా కల్పించారు. దుబారా ఖర్చులను సీఎం వైఎస్ జగన్ కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి రూపాయి వ్యయానికి జవాబుదారితనం ఉంటుంది. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదు" అని చంద్రబాబు ప్రభుత్వ దుబార ఖర్చులు, పవన్ ఉద్దానం వ్యవహారంపై విజయసాయిరెడ్డి పరోక్షంగా ప్రస్తావించారు.
కాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయాన్ని అప్పట్లో తెరపైకి తెచ్చి నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రలేపి వైద్యం అందించేలా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు, పవన్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments