మెగాభిమానులు, కార్యకర్తలకు పవన్ షాకింగ్ న్యూస్

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

జనసేన తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నారని గత కొన్ని రోజులుగా ఈ వార్తలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ ఎన్నికల వ్యవహారం మొదలుకుని పోలింగ్ అయ్యేవరకూ చిరు విదేశాలకు వెళ్లి పోతారని కూడా వార్తలు వినవచ్చాయి. అయితే ఇటీవల చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. చిరును కలిసి ఎన్నికల ప్రచారానికి రావాలంటూ కోరారు. అయితే చిరు ఈ నెల 8న ప్రచారానికి వస్తానని చెప్పి కొండాను పంపారు. కొండా.. మెగా ఫ్యామిలీకి బాగా కావాల్సిన వ్యక్తి కావడం, పైగా కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి కావడంతో చిరు కాదనలేక ప్రచారం వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారానికి ఏపీలో కూడా జనసేన తరఫున ప్రచారం చేస్తారని.. ఇద్దరు తమ్ముళ్ల గెలుపుకోసం ప్రచారం చేస్తారని అటు జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు భావించారు. అయితే గురువారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు.

పవన్ మాటల్లోనే... అన్నయ్య చిరంజీవి జనసేన ప్రచారానికి రావట్లేదని పవన్ తేల్చిచెప్పారు. దీంతో మెగాభిమానులు షాక్ తిన్నారు. అంతేకాదు చిరు రాజకీయాలకు సంబంధించి అన్నయ్య ఒక తుది నిర్ణయానికి వచ్చేశారని స్పష్టం చేశారు. రాజకీయాలను ఆయన చూసే విధానం... తాను చూసే విధానం వేరువేరన్నారు. ఈ విషయంలో తమ ఇద్దరి మధ్య పూర్తి స్పష్టం ఉందన్నారు. అన్నయ్య చిరంజీవి కళాకారుడని... తాను కళాకారుడిని కాదని తెలిపారు. తనును కూడా మీ కుటుంబ సభ్యుడిగానే చూడాలని వ్యాఖ్యానించారు.

గాజువాకలో నిర్వహించిన పవన్ మాట్లాడుతూ.. విశాఖపట్నం నాకు తల్లిలాంటిది.. అనేక మతాలు, అనేక కులాలు ఉన్న మినీ ఇండియా గాజువాక. అందుకే నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాను. సగటు మనిషి బ్రతికే ప్రాంతం గాజువాక.. పరిశ్రమలు ఉండీ ఉపాధి లేకపోవడం దౌర్భాగ్యం. డెయిరీ కాలుష్యంపై పోరాటం సాగిస్తాము. వ్యవస్థలో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. భూములు కోల్పోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేస్తాను. అన్ని రంగాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. అందరికీ అందుబాటులో ఉంటాను అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

More News

ఏపీకి పవన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజ‌లు మార్పు కోరుకుంటున్నారని, 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో జ‌న‌సేన‌, బిఎస్పీ, సిపిఐ, సిపిఎంలతో కూడిన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్

‘సీఎం పదవికి పవన్ అన్ని విధాలా అర్హులు..’

కేంద్రంలో బీఎస్పీ కూట‌మి ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామ‌ని, కేంద్ర ప‌రిధిలోని విభ‌జ‌న హామీల‌న్నీ ప‌రిష్కరిస్తామ‌ని బ‌హుజ‌న

బ్యాంక్‌లో లోన్స్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్...

బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్నవారికి ఆర్బీఐ శుభవార్త అందించింది.

అజిత్ పూర్తి చేసేశాడు.. 

త‌మిళ స్టార్ హీరో అజిత్ డిసెంబ‌ర్‌లో బాలీవుడ్ చిత్రం `పింక్‌` రీమేక్ చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేశాడు. ఖాకి ఫేమ్ హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో

రెండేళ్ల త‌ర్వాత‌... 

తెలుగులో హీరోయిన్‌గా త‌న కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంటున్న హీరోయిన్ ఈషారెబ్బాపై కోలీవుడ్ తంబీలు కూడా మ‌న‌సు ప‌డ్డారు.