నన్ను చూడటానికి ఎవరొస్తారులే అనుకున్నా: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
తన గురించి తానెప్పుడూ ఆలోచించని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నేడు ఆయన బర్త్డే సందర్భంగా జనసేన పార్టీ మీడియా విభాగంతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను నెల్లూరులో పెరుగుతున్నప్పుడు ఎలాంటి మధ్య తరగతి ఆలోచనా దృక్పథంతో ఉన్నానో.. ఇప్పటికీ అలాగే ఉన్నానని పవన్ తెలిపారు. సుస్వాగతం సినిమా రిలీజ్ అయినప్పుడు తాను కర్నూలుకి వెళ్లానని.. అక్కడ రోడ్ షో చేస్తూ తీసుకెళతామన్నారని.. అయితే తాను ఎందుకు అని అడగ్గా.. మిమ్మల్ని చూసేందుకు చాలా మంది వచ్చారన్నారని తెలిపారు. తనను చూడటానికి ఎవరొస్తారులే అనుకున్నానని.. కానీ దారి పొడవునా జన సందోహమని చెప్పుకొచ్చారు.
‘‘నా గురించి నేను పెద్దగా ఆలోచించను. అలాగే ఎక్కువగా ఊహించుకోను. నెల్లూరులో పెరుగుతున్నప్పుడు ఎలాంటి మధ్యతరగతి ఆలోచన దృక్పథంతో ఉన్నానో... ఇప్పుటికి అదే విధంగా జీవిస్తున్నాను. నన్ను లక్షలాది మంది అభిమానించడం, అదరించడం చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. సుస్వాగతం సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో ఫంక్షన్ ఉంది తప్పకుండా రావాలంటే ఇబ్బంది పడుతూనే కర్నూలు వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాకా రోడ్ షో చేస్తూ తీసుకెళ్తాం అన్నారు. దేనికి అని అడిగాను. మిమ్మల్ని చూడటానికి జనం చాలా మంది వచ్చారు అని చెప్పారు. నన్ను చూడటానికి ఎవరొస్తారు అనుకున్నాను. ఆ వాహనం ఎక్కేటప్పటికీ దారి పొడువునా విపరీతమైన జనం ఉన్నారు.
వీళ్లందరు నన్ను చూడటానికే వచ్చారా అనుకున్నాను. నాకు అప్పుడే అనిపించింది వాళ్లకు నాకు మధ్య పెద్ద తేడా లేదు. వాళ్లు అటువైపు ఉన్నారు... నేను ఇటువైపు ఉన్నాను అంతే అని. అటువంటి ఆలోచనా విధానం వచ్చింది తప్ప నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారనే ఆలోచన విధానం ఎప్పుడు లేదు. నా ప్రమేయం లేకుండా నా పుట్టిన రోజును పురస్కరించుకొని సేవా వారోత్సవాలు చేస్తున్నారంటే అది జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనం. వారికి నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం సమాజానికి ఉపయోగపడితే నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది. ఇందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com