Pawan Kalyan : జనసేనలో కోవర్టులు.. పక్కవాడికి సహకరిస్తే సస్పెన్షనే : నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక

2024 ఏపీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా ఆయన వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. టీడీపీ, వైసీపీల పల్లకిలు మోయడానికి తాను సిద్ధంగా లేనని.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం వుండాలని పవన్ కల్యాణ్ అన్నారు. అవసరమైతే ప్రత్యర్ధులతోనూ కలుస్తానని జనసేనాని బాంబు పేల్చారు. తాజాగా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో ఒకరిద్దరు కోవర్టులున్నారని.. తనను వెనక్కిలాగే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో క్రమశిక్షణా సంఘాన్ని నియమించుకుంటామన్న ఆయన.. పార్టీలో ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని తేల్చిచెప్పారు. జనసేనలో వుంటూ పక్కవాడికి సహకరించే పరిస్ధితి వుండకూడదని.. పార్టీలో వుంటూ ఏ ఒక్క తప్పు చేసినా సస్పెండ్ చేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని చెప్పి కేసీఆర్ వ్యూహం మార్చారు:

తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తామని కేసీఆర్ ప్రకటించారని.. కానీ ఆయన మనసు మార్చుకున్నారని పవన్ గుర్తుచేశారు. అది వారి వ్యూహామని.. జనసేనలోనూ తమకు ప్రత్యేకమైన వ్యూహాలు వున్నాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాదయాత్ర చేసిన వారందరూ వినోభా భావేలు కారని.. ఆంథ్రా థానోస్‌గా మారిన వాళ్లూ వున్నారని జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఎన్నికలకు వెళతామని ఆయన తెలిపారు.

ఆప్, బీజేపీలు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరాయి:

ఏడాదికే వైసీపీ ప్రభుత్వంతో జనం విసిగిపోయారని.. ఎంతమంది సీఎంలు సీమ నుంచి వచ్చినా అక్కడి అభివృద్ధి జరగలేదని పవన్ ఎద్దేవా చేశారు. మద్య నిషేధం అని చెప్పి.. రెట్టింపు అమ్మకాలు చేపట్టారని, సంక్షేమ పథకాల పేరుతో పదివేలు ఇచ్చి ఇరవై వేలు వసూలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈసారి వైసీపీ అధికారంలోకి రాకూడదని.. ఏపీ భవిష్యత్‌కు సంబంధించి తాను చాలా స్పష్టంగా వున్నానని జనసేనాని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా ఎందుకు కలిశారో వాళ్లే చెప్పాలని.. చంద్రబాబు - మోడీ కూడా మాట్లాడుకున్నారని పవన్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయిలో మూడో ప్రత్నామ్నాయంగా మారిందని.. బీజేపీ ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

More News

Amit Shah - Jr NTR : ఆంధ్రా సెటిలర్స్ కోసమా, స్టార్ సపోర్ట్ కోసమా.. ఎన్టీఆర్- అమిత్ షా భేటీ వెనుక..?

బీజేపీలో, కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా వున్న అమిత్ షాతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం..

NagaBabu : చిరంజీవి, పవన్‌ల జోలికొస్తే.. ఎవడైనా సరే తాటతీస్తా : నాగబాబు వార్నింగ్

కొణిదెల నాగబాబు.. మెగా బ్రదర్స్‌లో ఒకరు. ఒడ్డూ, పొడుగు అంతా బాగున్నప్పటికీ ఎందుకో ఆయన హీరోగా క్లిక్ కాలేదు.

నేను చేసిన సినిమాలన్నిటికంటే సైకలాజికల్ థ్రిల్లర్‌ గా వస్తున్న "అర్థం" నాకు వెరీ స్పెషల్.. హీరోయిన్ శ్రద్దాదాస్

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ మాయ అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమే "అర్థం".

మల్టీజానర్ మూవీగా "మాటరాని మౌనమిది" ఆకట్టుకుంటుంది - దర్శకుడు సుకు పూర్వాజ్

సస్పెన్స్ థ్రిల్లర్ "శుక్ర" చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుకు పూర్వాజ్.

'హలో వరల్డ్' వెబ్ సిరీస్  ప్రి రిలీజ్ ఈవెంట్

ఇప్పటి వరకు ZEE5 ప్రేక్షకులకు అద్భుతమైన వెబ్ సిరీస్ లను అందిస్తుంది .పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’,