వివేకా హత్యపై పవన్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకా హత్యపై జనసేన అధినేత స్పందించారు. "ఇంతకీ అసలు పులివెందులలో ఏం జరుగుతోంది. సొంత పినతండ్రి చనిపోతే గుడ్డిగా గుండెపోటు అని ఎలా చెబుతారు. కాసేపటికే గొడ్డలితో నరికి చంపారు అని ఎలా చెప్పగలరు. మృతదేహం వద్ద రక్తపు మరకలు ఉండవు. వేలిముద్రలు లభించవు. ఆధారాలు చెరిపేస్తారు. మీరు చట్టసభలకి వెళ్లి సమస్యలు పట్టించుకోకపోతే పోయారు. కనీసం సొంత బాబాయ్ హత్య చేయబడితే పట్టించుకోరా.? ఇలాంటి నాయకులు ముఖ్యమంత్రులు అయితే ప్రజలకి ఏం న్యాయం చేస్తారు.? వైసీపీ అధికారంలోకి వస్తే వీధి వీధికీ చిల్లర రౌడీలు తయారవుతారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలనా యంత్రాంగం మీద పట్టు పోయింది. పార్టీ నాయకుల మీద పట్టు కోల్పోయారు. చింతమనేని లాంటి నాయకులు అడ్డంగా దోచేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. ఇసుకని అడ్డంగా తినేస్తున్నారు. ఇవన్నీ పోవాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కో ఆకు రౌడీని కాళ్లు విరిచి కూర్చోబెట్టే బలమైన వ్యవస్థని తీసుకువస్తాం. పోలీస్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. చింతమనేని లాంటి రౌడీల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తాం. మా మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా తాట తీస్తాం" అని పవన్ ఆగ్రహంతో ఊగిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout