Pawan Kalyan: జగన్ నువ్వే నా నాలుగో పెళ్లాం.. పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం జగన్ తన నాలుగో పెళ్లామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన మూడు పెళ్లిళ్లపై జగన్ చేస్తున్న విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ బతుకు ఏంటో తనకు తెలుసని.. జూబ్లీహిల్స్ ఫాంహౌస్‌లో.. బంజారాహిల్స్ రెస్టారెంట్‌లో ఏం చేసేవారే తన దగ్గర లిస్ట్ ఉందని తెలిపారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా చేపట్టిన ‘తెలుగుజన విజయ కేతనం’ జెండా భారీ బహిరంగ సభలో పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే తాను తక్కువ సీట్లు తీసుకున్నానంటూ చేస్తున్న విమర్శలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
"సిద్ధం సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఇద్దాం.. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం. యుద్దం, రక్తం, కన్నీళ్లు , గాయాలు , బాధలు, వేదనలు తప్ప. కలలు, కలలు, పిరికితనం మోసం తప్ప. ఐదేళ్ల పాలనలో యువతను మోసం చేశారు. రైతులను మోసం చశారు. మహిళలను మోసం చేసారు. ఉద్యోగులను మోసం చేశారు. అందర్నీ మోసం చేసిన వ్యక్తికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది. టీడీపీ నాయకులు కానీ , జనసైనికులు కానీ మోసే జెండాకు చాలా విలువ ఉంది. పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు. గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది.. మన విజయానికి స్ఫూర్తి జెండా. పార్టీల స్ఫూర్తికి నిదర్శనం. 2024లో విజయానికి స్ఫూర్తి ఈ జెండాలు. అందుకే ఈ సభకు జెండా సభ అని పేరు పెట్టాం. బూతుల్లో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతే... జెండా కర్రతో తిరగబడాలనే ఈ జెండా సభ పెట్టా్ం" అన్నారు.
"ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి. అందుకే ఓజీ సినిమాలో సంపాందించిన డబ్బులను ఇలా హెలికాఫ్టర్లకు ఖర్చు పెడుతున్నాం. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలే పంచాయితీ చేస్తున్నారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవు. సభా వేదికగా చెబుతున్నా.. వైసీపీ గూండాలు తెటీపా-జనసేన నాయకులను, శ్రేణుల్ని ఇబ్బంది పెడితే.. మక్కెలు విరగొడతాం. జగన్.. ఇప్పటి వరకు నా తాలూకా శాంతినే చూశావు.. ఇప్పుడు యుద్ధం చూస్తావ్" అని హెచ్చరించారు.
‘‘పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నా. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించింది. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసింది. జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదు. కార్యకర్తలారా వ్యూహం నాకు వదలండి.. నన్ను నమ్మండి. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే. అంకెలు లెక్కపట్టవద్దని విపక్షాలకు చెప్పండి. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నా.. కోట కూడా కడతాం. జగన్ తాడేపల్లి కోట కూడా బద్దలుకొడతాం. సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు.. గుండెల నిండా రక్తం మరిగే యువత కావాలి. యుద్ధం చేసే వాళ్లు కావాలి" అని తెలిపారు.
"జగన్ భార్యను భారతి గారు అని మేము మర్యాదిస్తాం. ఆయన మాత్రం మా భార్యల్ని పెళ్లాలు అని సంబోధిస్తున్నారు. అదే మాట మిమ్మల్ని అంటే ఏమంటారు భారతి గారు. మూడు పెళ్లిళ్లు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నానని విమర్శిస్తున్నారు. నా నాలుగో పెళ్లాం జగన్ ఏమో. బాబాయ్‌ని మర్డర్‌ని చేసినా.. లక్ష కోట్ల అవినీతి చేసినా.. దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసినా.. సొంత తల్లి, చెల్లిని తరిమేసినా.. జగన్‌ను పొగిడే సమూహం ఆయనకుంది. నా సమూహం మాత్రం నన్ను ఎందుకు ప్రశ్నిస్తోంది. నన్ను ప్రశ్నించే వాళ్లు నాతో నిలబడటం నేర్చుకోండి. నేను ఒక ప్రాంత వ్యక్తిని కాదు.. ఓడినా, గెలిచినా మీతో ఉంటా. కార్యకర్తలారా నా వ్యూహాలను తప్పుపట్టవద్దు. పవన్ అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, యువత కన్నీళ్లు తుడిచే చెయ్యి. జగన్‌ను అథఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం. ఈ సభావేదికగా యుద్ధానికి నేను శంఖారావం పూరిస్తున్నా. వైసీపీ పాలను అంతం చేద్దాం..జగన్‌ను రాష్ట్రం నుంచి నుంచి తరిమేద్దాం" అంటూ పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments