భగవంతుడు అంటే ఏమిటో చెప్పిన పవన్..!

  • IndiaGlitz, [Saturday,November 19 2016]

ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ ఎన్.టీవీ ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వ‌హిస్తున్న అథ్యాత్మిక కార్య‌క్ర‌మం కోటి దీపోత్స‌వం. హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తున్న ఈ కోటి దీపోత్స‌వంలో 13వ రోజు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. ఈ అథ్యాత్మిక వేదిక పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ....ఇది నాకు సంబంధించిన వేదిక కాక‌పోయినా న‌న్ను ఇక్క‌డికి పిలిచి ఈ భ‌క్తి కార్య‌క్ర‌మంలో పాల్గొని హార‌తిని ద‌ర్శించుకునే అవ‌కాశం ఇచ్చిన న‌రేంద్ర చౌద‌రి గార్కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాను.
చిన్న‌ప్ప‌టి నుంచి నాకు భ‌గ‌వంతుడు అంటే భ‌యం. త‌ప్పు చేస్తే చూస్తుంటాడు అనే భ‌య‌మే న‌న్ను జాగ్ర‌త్త‌గా ఉంచింది. అలాగే నేను భ‌గ‌వంతుడు అంటే ధ‌ర్మాన్ని కాపాడ‌డం అనుకుంటాను. నా దృష్టిలో భ‌గ‌వంతుడు అంటే...అడిగిన‌వి ఇచ్చేవాడు కాదు... అవ‌స‌ర‌మైన‌వి ఇచ్చేవాడు భ‌గ‌వంతుడు అని న‌మ్ముతాను. అంద‌రికీ ఆయురారోగ్యాలు ఇవ్వాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాను ఓం న‌మఃశివాయ అంటూ ప‌వ‌న్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. మాట్లాడిందే తక్కువే అయినా...త‌న దృష్టిలో భ‌గ‌వంతుడు అంటే ఏమిటో చెప్పి భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నారు ప‌వ‌న్..!